TG-5503
Telugu

ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా

Prabhuvaa Ninnu Keerthinchutaku Veenoollllu Chaalunaa

0
views
పల్లవి

ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్ళు చాలునా ఎంతగ నిన్ను కీర్తించినను - యేమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా... ఉండరధాతి ||ప్రభువా||

1వ చరణం

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా... నే తగుదునా వింతగ నను దీవించుటకు నేనర్హుడనా... నేనర్హుడనా ||ప్రభువా||

2వ చరణం

నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా... నే తగుదునా వింతగ నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా... నేనర్హుడనా ||ప్రభువా||