TG-254
Telugu

ప్రభువా పంపుమా నీ శుభవర్షము

prabhuvaa panpumaa nee shubhavarssamu

203
views
పల్లవి

ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం బనెడి విభవామృతము కురియఁజేసి ||ప్రభువా పంపుమా||

1వ చరణం

వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ ||ప్రభువా పంపుమా||

2వ చరణం

నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్ పావనంబు బొందునటులఁ ||ప్రభువా పంపుమా||

3వ చరణం

ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ ||ప్రభువా పంపుమా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.