TG-515
Telugu

ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్

prabhuvugan prathisstinparee gruhamuna kreesthun

211
views
పల్లవి

ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా ప్రతిష్టింపరె విభవమొందగ నతని శుభమౌ నామము ధర సౌ రభమును వెదజల్లగ ప్రబలమౌ ప్రేమన్ ప్రభుని యెడ గనపర్చరె ||ప్రభువుగన్ ప్రతిష్టింపరే||

1వ చరణం

పూర్ణ ప్రేమను జూపరే గృహమున క్రీస్తును పూర్ణ ప్రేమను జూపరే పూర్ణ హృదయముతోను పూర్ణయాత్మతో మరి ప్ర పూర్ణ శక్తితో జూపరే క్రీస్తునిలో సం పూర్ణులగుటకు సాగరె ||ప్రభువుగన్ ప్రతిష్టింపరే||

2వ చరణం

భక్తితోడను గొల్వరే గృహమున క్రీస్తున్ భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు తన స్వ రక్తమీయను మనకై రిక్తుడాయెను జూడరే ముక్తిదాతను నా సక్తితో గొనియాడరే ||ప్రభువుగన్ ప్రతిష్టింపరే||

3వ చరణం

నమ్మకస్థులై యుండరే గృహమున క్రీస్తుకు నమ్మకస్థులై యుండరే అమ్మహాత్ముని నామ మిమ్మహిన్ దగజాటన్ నమ్మె మిమ్మును జూడరె సమ్మతిన్ గ్రీస్తున్ నమ్మకంబుగ జాటరె ||ప్రభువుగన్ ప్రతిష్టింపరే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.