TG-3417
Telugu

యేసయ్యా నీ సన్నిధిలో నైవేద్యమై

yeesayyaa nee sannidhiloo naiveedyamai

ప్రకాష్ · Prakashఅరవింద్ · Aravind
0
views
Chorus

యేసయ్యా నీ సన్నిధిలో నైవేద్యమై నా ప్రాణార్పణము చేసెద నీ పరిశుద్ధ ఆలయమందు దూత పాటలను నే పాడెద

1వ చరణం

ఆరాధ్యుడా అభిషిక్తుడా-యుగములకు స్తోత్రార్హుడా ఆపదలో నీ పర్ణశాలలో దాచావయ్యా శోధన వేదన సమయములో తప్పించావయ్యా || యేసయ్యా ||

2వ చరణం

సాత్వీకుడా సీయోనురాజా-సుకుమారుడా సంపన్నుడా కవులును ఋషులును ఎరిగిన దేవుడు నీవేనయ్యా ప్రవచనాలు నెరవేరెను నీలో నజరేయుడా || యేసయ్యా ||

3వ చరణం

అల్ఫయును ఒమేగయునై-సంఘముతో కొనిపోవుము జీవము కలిగిన శక్తిమంతుడవు నీవేనయ్యా యూదా గోత్రపు కొదమ సింహమై వస్తావయ్యా || యేసయ్యా ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.