ప్రేమ స్వరూపివి నీవేనని గళమెత్త నిన్ను స్తుతించేదను
Preema Svaroopivi Neeveenani Gallameththa Ninnu Sthuthincheedanu
ప్రేమ స్వరూపివి నీవేనని గళమెత్త నిన్ను స్తుతించేదను నీ ప్రేమ ఇలలో చాటేదను నీ సాక్షిగా నేను నిలిచెదను ఆశతో వేచిఉన్న యేసయ్యా నీ ప్రేమ నాలో నింపుమయా నీ సాక్షిగా నను నిలుపుమయా యేసయ్యా నీవే నా ప్రాణమయా యేసయ్యా నీవే నా జీవమయా యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... మట్టితో నను సృష్టించి నీ చేతితో నను రూపించి నీ ఊపిరి నాలో నింపి నీ పోలికలో చేసావయ్యా ఆ.. ఆ.. (2) నీ సర్వ సృష్టి అంతటిలో నన్ను ప్రత్యేకముగా చేసి నీ ప్రేమ నీ కరుణ నీ జాలి మాపై చూపి నా కొరకు నీవు ఆ సిలువలో మరణించితివి నీ కన్న లోకాన నాకంటూ ఎవరు లేరు నన్ను దాచి దరిచేర్చి నీ కృపతో నను నింపితివే అశతో వేచిఉన్న యేసయ్యా నీ ప్రేమ నాలో నింపుమయా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా యేసయ్యా నీవే నా ప్రాణమయా యేసయ్యా నీవే నా జీవమయా యేసయ్యా నీవే నా సర్వమయా యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా నీవే నా ప్రాణమయా యేసయ్యా నీవే నా జీవమయా యేసయ్యా నీవే నా సర్వమయా యేసయ్యా... యేసయ్యా...
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.