ప్రేమింతును నిన్నే – జీవింతును
preeminthunu ninnee – jeevinthunu
🎵 TG-1797🌐 Telugu
పల్లవి
ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై యేసూ… నీవే… అతి సుందరుడా – అతి శ్రేష్టుడా నీవే… అతి కాంక్షనీయుడా నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును||
1వ చరణం
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2) నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ||
2వ చరణం
నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది షాలేము రాజా సమాధాన కర్తా రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా