ప్రేమ శాశ్వత కాలముండున
Prema Shaashwatha Kaalamundunu
ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2) ప్రేమ విలువను సిలువ జూపె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2) ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము (2) ప్రేమ సహింప నేర్పును ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
ప్రేమలో డంబముండదు ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2) ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
ప్రేమించు సహోదరుని ప్రార్ధించు శత్రువుకై (2) ప్రేమ యేసుని మనస్సు ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును (2) ప్రేమయే సమాధానము ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ (2) వీటిలో శ్రేష్టమైనది ప్రేమ యే ప్రేమ ||ప్రేమ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.