TG-4135
Telugu

ప్రేమా పూర్ణుడ

Premaa Poornudu

0
views
పల్లవి

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ – కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||

1వ చరణం

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||

2వ చరణం

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||