♪♫
TG-4136
Telugu
ప్రేమగల మా ప్రభువా
Premagala Maa Prabhuvaa
0
views
పల్లవి
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల||
1వ చరణం
నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల||
2వ చరణం
అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల||
3వ చరణం
బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల||
4వ చరణం
తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల||
5వ చరణం
మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2) వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||