TG-4137
Telugu

ప్రేమగల యేసయ్

Premagala Yesayyaa

19
views
పల్లవి

ప్రేమగల యేసయ్యా జీవ వృక్షమా యేసయ్యా (2) సిలువలో బలి అయిన యేసయ్యా తులువలో వెలి అయిన యేసయ్యా (2) పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల||

1వ చరణం

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా కొరడాల దెబ్బలు చెళ్లుమనెను శరీరపు కండలే వేలాడేను (2) నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా||

2వ చరణం

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు గడ్డము పట్టాయనను లాగుచుండగా నాగటి వలె సిలువలో దున్నబడగా (2) ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా||

3వ చరణం

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే తనువంత రుధిరముతో తడిసిపోయెనే తండ్రీ అని కేక వేసి మరణించెనే (2) మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.