TG-4139
Telugu

ప్రేమతో యేస

Prematho Yesu

0
views
పల్లవి

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2) రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2) ||ప్రేమతో||

1వ చరణం

పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను (2) శాపగ్రాహియాయె సిలువలో శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

2వ చరణం

ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడె (2) ప్రాణమిడె నేసు సిలువలో ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

3వ చరణం

సిలువలో నీకై దప్పిగొని కలుష నీ క్షమకై ప్రార్థించి (2) సహించి ప్రాణమిడె నీ కొరకు సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

4వ చరణం

తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించె (2) కాపరి స్వరము ధ్వనించె కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

5వ చరణం

తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు (2) నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

6వ చరణం

తానే కడుగును తన రక్తముతో తండ్రివలె నీ పాపమునంత (2) తనయుడవై పోదు విపుడే తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

7వ చరణం

ప్రేమవార్త ప్రకటింపబడె ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2) కృపాకాలమిదే జాగేల కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||