TG-4142
Telugu

ప్రేమించు దేవుడ

Preminchu Devudu

0
views
పల్లవి

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు – యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు||

1వ చరణం

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

2వ చరణం

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

3వ చరణం

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వ కాలమందు జయమిచ్చును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

4వ చరణం

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||