TG-4143
Telugu

ప్రేమింతును నిన్

Preminthunu Ninne

0
views
పల్లవి

ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై యేసూ… నీవే… అతి సుందరుడా – అతి శ్రేష్టుడా నీవే… అతి కాంక్షనీయుడా నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును||

1వ చరణం

నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2) నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ||

2వ చరణం

నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2) షాలేము రాజా సమాధాన కర్తా రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2) ||యేసూ||