TG-4144
Telugu

ప్రేమిస్తా నిన్నే

Premisthaa Ninne

0
views
పల్లవి

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా||

1వ చరణం

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||

2వ చరణం

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||

3వ చరణం

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||