ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం

priya yeesu nirminchithivi - priyamaara naahrudayam

🎵 TG-1135🌐 Telugu
పల్లవి

ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం ముదమార వసియించు - నా హృదయాంత రంగమున (2)

1వ చరణం

నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి ||ప్రియ||

2వ చరణం

ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి కరుణా రసముతో నకై - కనిపెట్టితివి తండ్రీ ||ప్రియ||

3వ చరణం

వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే చేరీతి నీదు దారి - కోరీ నడిపించుము||ప్రియ||

4వ చరణం

ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా ||ప్రియ||

Report Error