TG-1570
Telugu

ప్రియ యేసు రాజును నే

priya yeesu raajunu nee

78
views
పల్లవి

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ||ప్రియ యేసు||

1వ చరణం

యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను బంగారు వీదులలో తిరిగెదను ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ వర్ణింప నా నాలుక చాలదయ్యా ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం