ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
priya yeesu raajunu nee choochina chaalu
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు||
హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు (2) హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు||
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
