ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్రంబు
priyamainatti naa yaathma sthoothranbu
ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్రంబు చెల్లింపు మహిమ శక్తులుగల నా ఱేని మన్నింపు కూడుడిట వీణెల గానమున సన్నుతు లొసంగ రండి.
సర్వము వింతగ పాలనచేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను నొరయగా నడిపి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు. ||ప్రియమైనట్టి నా||
ఎంతో చమత్కతిగా నా యాత్మ! నిన్ సృజించి క్షేమ మారోగ్యము నెసగగా నడిపించి కష్టములలో బొదివి ఱెక్కలతో బ్రోచిన ప్రభునుతింపు ||ప్రియమైనట్టి నా||
అందరు గాంచెడులాగు నీ స్థితి దీవించి యాకసమందున నుండి కృపన్ గురిపించి ప్రేమతో జూచు నాతండెవ్వడో శక్తు నా ప్రభు నుతింపు ||ప్రియమైనట్టి నా||
సకలాంతః కరణంబులతోడ నుతింపు ఆయన నామ ప్రసిద్ధి గీర్తింపు వెలుంగులో నా బ్రహాం సంతతితో ప్రభునుతింపుమి ఆమేన్ ||ప్రియమైనట్టి నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.