TG-4152
Telugu

పునరుత్థానుడా

Punarutthaanudaa

19
views
పల్లవి

పునరుత్థానుడా నా యేసయ్యా (2) మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2) నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి||

1వ చరణం

నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి||

2వ చరణం

చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిను ప్రకటించెదా (2) ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.