TG-3410
Telugu

పునరుత్థానుడా ఆదిసంభూతుడా

punarutthaanudaa aadisanbhootudaa

Daniel JohnJesus Chanan Ministriesప్రకాష్ · PrakashBro.Prakash Garu · Prakash
0
views
Chorus

పునరుత్థానుడా ఆదిసంభూతుడా (2) సమాధిని గెలిచి తిరిగి లేచిన సృష్టిలో నీ సాటిలేరెవ్వరు (2)

పల్లవి పూర్వ భాగం

జయమే జయమే యేసయ్యా జై (2) ||పునరుత్థానుడా||

1వ చరణం

గెత్సెమనే తోటలో ప్రార్ధించి లేచి క్రయధనము చెల్లించి సిలువను మోసావు (2) రుధిరమునిచ్చిన దైవసుత నీ మార్గములో నడిపించీ (2) నీతిని శాంతిని కలిగించావు సంపూర్ణముగా (2) ||జయమే||

2వ చరణం

ఆదివారం తెల్లవారు జామున లేచి ఆయన ఇక్కడ లేడనే వార్త పంపావు (2) నలువది దినములు మనుష్యులకు అనేక రుజువులు కనపరచీ (2) దేవుని శక్తిని చూయించావు సంపూర్ణముగా (2) ||జయమే||

3వ చరణం

మృతులలో ప్రధమ ఫలముగ లేచి అక్షయముగ సమరూపమిచ్చావు (2) ఆదాము తెచ్చిన మరణమును కడపటి ఆదాముగా గెలిచీ (2) మరణపు ముల్లును విరిచావు సంపూర్ణముగా (2) ||జయమే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.