♪♫
204
views
పల్లవి
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె యేసుఁడు||
1వ చరణం
ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె యేసుఁడు||
2వ చరణం
యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||పుట్టె యేసుఁడు||
3వ చరణం
తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె యేసుఁడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.