పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా

puvvukintha parimallamaa oka roojukintha andamaa

🎵 TG-1136🌐 Telugu
పల్లవి

పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా (2) పూస్తున్నది ఉదయాన్నే రాలిపోవుతున్నది త్వరలోనే (2)

1వ చరణం

ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమలాన్నే ఇస్తుండగా...ఆ 2 ఆ పువ్వు కంటే మరిగొప్పగా చేసిన నీలో ఆపరిమళముందా..? ||పువ్వుకింత పరిమళమా||

2వ చరణం

ఒకనాడు యేసు మన పాపమునకై పరిమళాన్ని వెదజల్లెనూ...2 ఆయేసు మరణం నీకోసమేనని ఇకనైనా గమనించవా...? ||పువ్వుకింత పరిమళమా||

3వ చరణం

అతిచిన్న ఆయువు ప్రతిపువ్వు కలిగి అందరిని ఆకర్శించెను...2 బహుకాలము బ్రతికి బహు జనులను పిలచి సువార్తను వెద జల్లవా..? 2 ||పువ్వుకింత పరిమళమా||

Report Error