TG-536
Telugu

రాజా నా దేవా నన్ను

raajaa naa deevaa nannu

210
views
పల్లవి

రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభుయేసు నా దేవా నన్ను గావ రావే||రాజా నా||

1వ చరణం

తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ జల్లనైన మోక్ష మియ్య ||రాజా నా||

2వ చరణం

బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా నా||

3వ చరణం

మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా నా||

4వ చరణం

దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.