TG-236
Telugu

రాజాధి రాజా రారా రాజులకు

raajaadhi raajaa raaraa raajulaku

206
views
పల్లవి

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా

1వ చరణం

ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే ఓ …. మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి రాజా||

2వ చరణం

ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా – ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ – భూమి ఆకసంబు మారిపోవ నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి రాజా||

3వ చరణం

ఆ … ఆకసమున దూత లార్భటింపగా – ఆ … అది భక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ – యేసు నాధ! నీదు మహిమ లోన – మాకదే మహానంద మౌగ ||రాజాధి రాజా||

4వ చరణం

ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా – ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా – పరమ దూతలార! భక్తులారా! పౌలపోస్తులార! పెద్దలారా! గొఱ్ఱియ పిల్ల యేసు రాజు పేర – క్రొత్తగీతమెత్తి పాడ రారా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.