TG-2972
Telugu

రాజులైన యాజకులం (వరము 2)

raajulaina yaajakulam (varamu 2)

Nikhil Paulషడ్రక్ · Shadrachఎనోచ్ అబ్రహం · Enoch Abraham
22
views
Chorus

రాజులైన యాజకులం - రాజుల రాజుకు వారసులం ధైర్యము వీడని దాసులము - పరాక్రమమే మా బలము

బ్రిడ్జి

యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా ధ్వజముగా నిలువగా (2) సాహసకార్యాలు చూపను - భీకర కార్యాలుచేయను (2) తిరిగి లేచేగా - తన ఆత్మతో నింపెగా - తిరిగి లేచేగా - ఆత్మశక్తితో నింపెగా లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా రాఫా రాఫా రాఫా రాఫా (2)

1వ చరణం

దుప్పటే నదిలో దారిచూపేగ కఱ్ఱయే సంద్రమును చీల్చివేసేగా అస్థిపంజరమే - జీవమివ్వగా - జీవముగల నీకు అసాధ్యమా అగ్నిలో నిలచిన కాలనేకాలలేదుగా సింహలు చుట్టుముట్టినా చలించలేదుగా.. రాజులే కూలెగా - శూరులే వనికేగా ఆజ్ఞలే మారగా - నీవు నిలువగా భూమిని తలక్రిందులు చేయాగా అపవాదితంత్రములను చీల్చగా అధికారమిచ్చెనే - సామర్ధ్యమిచ్చెనే లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా

2వ చరణం

మరణముతో యేసు మాటలాడేగా పాటతో పునాదులే కదిలిపోయేగా పామరులే అద్భుతాలు ప్రారంభించగా దీనులే ధైర్యముగా నిలిచినడువగా మాటతో నీడతో అద్భుతాలే చేసెనే మారని దేవుడే తోడుండగా కనబడనిశత్రువులు కానరారే చూచినా కాపాడే దేవుడు నీలోవుండగా యేసయ్య నీకు ముందుగా నడువగా నీకు విరోధముగా లేచుట సాధ్యమా (2) నమ్మితే చాలు చేస్తావు కార్యాలు (2) లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా పునరుత్తానుడు - యేసు సజీవుడు పునరుత్తానుడు - మనలో వున్నవాడు పునరుత్తానుడు - ఆదరించువాడు పునరుత్తానుడు - అధికారమిచ్చువాడు పునరుత్తానుడు - జయింపజేయువాడు పునరుత్తానుడు - రాజ్యమేలువాడు పునరుత్థానుడు - రాజ్యమిచ్చువాడు మెస్సయా......... రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము గొర్రెపిల్లకే ....గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే ...(2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.