రాజులకు రారాజు పుట్టినాడు మన యేసు మహారాజు పుట్టినాడు
Raajulaku Raaraaju Puttinaadu Mana Yeesu Mahaaraaju Puttinaadu
రాజులకు రారాజు పుట్టినాడు మన యేసు మహారాజు పుట్టినాడు (2) సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు (2) ||రాజులకు||
కష్టాలు కన్నీళ్లు తుడిచి వేస్తాడు రోగులకు స్వస్థత నిచ్చే పరమా వైద్యుడు నీ కొరకు నా కొరకు జన్మించినాడు మహిమ స్వరూపుడు తన మహిమ విడిచాడు (2) ||సర్వ||
పాపాల ఊబి నుండి విడిపించువాడు పాపిని పరిశుద్ధంగా మార్చే మహనీయుడు నీతోనీ నాతోని మాట్లాడే దేవుడు కరుణ సంపన్నుడు కరుణించగా వచ్చాడు (2) ||సర్వ||
అంతులేని ప్రేమను చూపించువాడు అంతము వరకు నడిపించే నాయకుడు నిన్ను నన్ను పరమునకు చేర్చే పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు (2) ||సర్వ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.