TG-5656
Telugu

రాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి అరుదెంచె ప్రభూ

Raajularaaju Prabhuvula Prabhoo Ee Jagathiki Arudenche Prabhoo

0
views
పల్లవి

రాజులరాజు - ప్రభువుల ప్రభూ ఈ జగతికి - అరుదెంచె ప్రభూ 1.  ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో ఆ దినమున పవిత్ర జనమున - మహిమాశ్చర్యకరుడగు ప్రభు 2.  ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్ ప్రభు జీవితులను మృతులైన వారిని - దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్ 3.  ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలిసి వెళ్ళెదరు విశ్వాసులను ప్రేమతో ప్రభువు - ఆహ్వానించును తన సన్నిధికి 4.  అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్ తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు - జీవ కిరీటము నీకిచ్చును