TG-2770
Telugu

రాకడ ప్రభుని రాకడ రాకడ

raakada prabhuni raakada raakada

41
views
పల్లవి

రాకడ ప్రభుని రాకడ రాకడ రెండవ రాకడ ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

1వ చరణం

నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంతా దేవుని మరచియుండగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ||

2వ చరణం

దేవుని మరచిన ప్రజలందరిని సువార్తకు లోబడని జనులందరిని శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును అగ్ని జ్వాలలతో అవని కాల్చును వేదనతో భూమినంత బాధపరచును తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ||