రాకడ సమయంలో
Raakada Samayamlo
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ||
యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య||
ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య||
దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య||
శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య||
నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? (2) నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య||
అన్నీటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? (2) ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.