రాకడ సమయములో - కడబూర శబ్ధముతో
raakada samayamuloo - kadabuura shabdhamuthoo
రాకడ సమయములో - కడబూర శబ్ధముతో యేసుని చేరు కొనే - విశ్వాసము నీకుందా (2) రావయ్య యేసయ్యా - వేగమే రావయ్యా (2)
యేసయ్య రాకడ సమయములో - ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? (2) ||రాకడ సమయములో||
ఇంపైన దూప వేదికగా - ఏకాంత ప్రార్ధన నీకుందా? (2) యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2) ||రాకడ సమయములో||
దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసు నాధునితో సహవాసం నీకుందా? (2) ||రాకడ సమయములో||
శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రాకడ సమయములో||
నీ పాత రోత జీవితము - నీ ఘోర హృదయము మారిందా?(2) నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2) ||రాకడ సమయములో||
అన్నిటి కన్న మిన్నగా - కన్నీటి ప్రార్ధన నీకుందా? (2) ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2) ||రాకడ సమయములో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.