TG-4173
Telugu

ద్రాక్షావల్లివి నీవైతే

Raakshaa Vallivi Neevaithe

0
views
పల్లవి

ద్రాక్షావల్లివి నీవైతే తీగెగ నేను ఎదిగితిని (2) తండ్రి తోటలో నే నాటబడితి ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా||

1వ చరణం

చల్ల గాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా (2) నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా||

2వ చరణం

కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే (2) ఆకు మాటున తీగె గావున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచె అందులో ఫలితము కొరకై కలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా||