TG-3358
Telugu

రానున్న రారాజని, మనసున్న మారాజని

raanunna raaraajani, manasunna maaraajani

Blessing KumarHermon Ministriesవిజయ్ కుమార్ · Vijay Kumarవిజయ్ కుమార్ · Vijay Kumar
0
views
Chorus

రానున్న రారాజని, మనసున్న మారాజని, నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా (2) ఆడి కొనియాడి ఆర్భటించి నాట్యమాడుచు (2) ||రానున్న||

1వ చరణం

లోకమంతా మాయేనని పాపమంత విడువుము రా క్రీస్తు యేసులో రక్షణ కలుగును పాపక్షమాపణ (2) నీవే నా శరణని నీవే నా దైవమని నీవే నా జీవమని (2) రమ్ము రారమ్ము ఈనాడే రక్షణ దినము (2) ||రానున్న||

2వ చరణం

ధర్మ కర్మ సంస్కారాలు స్వర్గానికి చేర్చలేవురా మర్మమైన నా యేసుడే మోక్షరాజ్య ప్రధాతరా (2) నీలోనే మోక్షమని నీలోనే రక్షణని నీలోనే శిక్షణని (2) రమ్ము రారమ్ము తక్షణమే క్రీస్తుని చేరా (2) ||రానున్న||

3వ చరణం

భోగభాగ్య ఐశ్వర్యాలు నిత్యజీవ మివ్వలేవురా ఆస్తి పాస్తి అంతస్తులు ఆత్మ శాంతి నివ్వలేవురా (2) యేసే నీ ఐశ్వర్యం యేసే నీ సౌభాగ్యం యేసే నీ సౌఖ్యమని (2) రమ్ము రారమ్ము నీ సర్వం సమర్పించుము (2) ||రానున్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.