రారాజు జన్మించే ఇలలోన
Raaraaju Janminche Ilalona
రారాజు జన్మించే ఇలలోన యేసు రారాజు జన్మించే ఇలలోన (2) ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా రండీ మనమంతా చాటి చెప్పుదాం (2) ఓ సోదరా… ఓ సోదరీ… (2) విష్ యు హాప్పీ క్రిస్మస్ అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు||
అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2) రాజులకు రారాజు పుడతాడంటూ లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2) రాజాధి రాజుని చూడాలంటూ (తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||
అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా (అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2) రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2) ఈ లోక రక్షకుని చూడాలంటూ (ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.