♪♫
TG-5669
Telugu
రారాజు జన్మించినాడు ఈ అవనిలోన ఆ నాడు
Raaraaju Janminchinaadu Ee Avaniloona Aa Naadu
0
views
పల్లవి
రారాజు జన్మించినాడు ఈ అవనిలోన ఆ నాడు నీ హృదిలో జన్మించుతాడు స్థిరపరచుకో నీ మదిని నేడు (2) యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకో యేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో (2) ||రారాజు||
1వ చరణం
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరమును విని తీసినయెడల వచ్చెదను (2) అని నిన్ను పిలుచుచున్నాడు త్వరగా తలుపును తెరచి చూడు చేజార్చకీ అవకాశము నేడు రాదీ సమయము ఇంకేనాడు (2) ||యేసే దైవం||
2వ చరణం
నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి కడకు చేరే మార్గం లేదన్నాడు (2) ఈ మాటను పరికించి చూడు యోచించుము నిజమేదో నేడు త్వరలో ప్రభు రానైయున్నాడు ఆ లోపే యేసయ్యను వేడు (2) ||యేసే దైవం||