TG-5665
Telugu

రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము

Raarammu Raarammu Saathveekudaina Yeesuni Yoddaku Raarammu

0
views
పల్లవి

రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన 1.  సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును 2.  పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా 3.  దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో 4.  నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును 5.  యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము 6.  ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము 7.  యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము