రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద
Raarandi Yeesu Paadamula Cheera Paapa Vimukthi Ponda
రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద అను పల్లవి: వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను 1. జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా? సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును 2. ఆశతో యేసు నిలిచియున్నాడు పాపీ నిన్ను రక్షింపను జీవితము మోసమగుచున్నది - పాపీ యేసుని రక్షణ వెదుక 3. నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే 4. ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను 5. పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను 6. మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు 7. కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.