♪♫
TG-5677
Telugu
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
Raare Choothumu Raajasuthudee Reeyi Janana Maayenu
21
views
పల్లవి
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
1వ చరణం
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||
2వ చరణం
కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2) తెల్లగానదే తేజరిల్లెడి (2) తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||
3వ చరణం
బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాలవృద్ధుల (2) నేల గల్గిన నాథుడు (2) ||రారే||
4వ చరణం
యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె (2) సదమలంబగు మదిని గొల్చిన (2) సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.