రారె చూతుము రాజసుతుడీ రేయి
raare chuuthumu raajasuthudee reeyi
పల్లవి
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె చూతుము||
1వ చరణం
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె చూతుము||
2వ చరణం
కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె చూతుము||
3వ చరణం
బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె చూతుము||
4వ చరణం
యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె చూతుము||