♪♫
TG-5675
Telugu
రారె గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి
Raare Gollavaaralaaraa Neeti Raathri Bethleheemu Noora Jeeri
21
views
పల్లవి
రారె గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తువారి జాడ కన్నులారా జూతము వేగ ||రారె గొల్లవారలారా||
1వ చరణం
పుట్టు చావులు లేనివాడట పసుల తొట్టిలో పరుండె నేడట (2) ఎట్టి వారలను జేపట్టి పాపము లూడ గొట్టి మోక్షపు త్రోవన్ బెట్టు వాడట వేగ ||రారె గొల్లవారలారా||
2వ చరణం
బహుకాలమాయెను వింటిమి నేడు మహికి వచ్చుట కను గొంటిమి (2) విహితము తోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము ||రారె గొల్లవారలారా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.