TG-300
Telugu

రారె యేసుని జూతము కోరిక

raare yeesuni juuthamu koorika

208
views
పల్లవి

రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె యేసుని||

1వ చరణం

సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె యేసుని||

2వ చరణం

ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె యేసుని||

3వ చరణం

కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె యేసుని||

4వ చరణం

ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు ||రారె యేసుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.