TG-301
Telugu

రారో జనులారా వేగముఁ గూడి

raaroo janulaaraa veegamum guudi

207
views
పల్లవి

రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో జనులారా||

1వ చరణం

అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో జనులారా||

2వ చరణం

మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో జనులారా||

3వ చరణం

పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో జనులారా||

4వ చరణం

తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో జనులారా||

5వ చరణం

సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో జనులారా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.