TG-1214
Telugu

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము

raavayya yeesunaadhaa maa rakssanna maargamu

202
views
పల్లవి

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

1వ చరణం

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||

2వ చరణం

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య||

3వ చరణం

పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియు పారద్రోలుటకు ||రావయ్య||

4వ చరణం

అందమైన నీదు పరమానంద పురమందు మే మందరము జేరి యానందించుటకు ||రావయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.