TG-4185
Telugu

రావయ్య యేసునాథా

Raavayya Yesunaathaa

0
views
పల్లవి

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||

1వ చరణం

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య||

2వ చరణం

మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య||

3వ చరణం

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య||

4వ చరణం

అందమైన నీదు పరమానంద పురమందు మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య||