♪♫
TG-1870
Telugu
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
raavayyaa yeesayyaa naa intiki
81
views
పల్లవి
రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని… నీ రాకకై నే వేచియుంటిని (2) కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||
1వ చరణం
యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను అహంకారము గర్వము నంటనీయను నమ్మకస్థునిగా నే నడచుకొందును నిర్దోష మార్గముల నడచుకొందును మోసము నా ఇంట నిలువనీయను అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.