TG-3248
Telugu

రక్షక విమోచకుడా నీకే ఆరాధన

rakshaka vimoochakudaa neekee aaraadhana

ISAAC PILLIఎలిజబెత్ పిల్లి · Elizabeth Pilliఅంకిత కాకి గొల్ల & ఎలిజబెత్ పిల్లి · Ankitha Kaki Golla & Elizabeth Pilli
14
views
Chorus

రక్షక విమోచకుడా నీకే ఆరాధన… సజీవుడా సర్వోన్నతుడా నీకే స్తుతి ఆరాధన… పది వేలలో అతి సుందరుడా మహత్యముగల రాజా ప్రతి దినము నిన్ను స్తుతింతును ఇహపరమున పూజ్యుడా నీకే ఆరాధన, స్తుతి స్తుతి ఆరాధన - నీకే ఆరాధన దేవా, యేసయ్యా…

1వ చరణం

ప్రేమకే రూపమా దీర్ఘశాంతుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా ధవళవర్ణుడా కృపామయా దయామయా కనికరపూర్ణుడా కోట్లాది దూత సైన్యము చేత పూజించబడుతున్న దేవా

2వ చరణం

వేల్పులలో మహాఘనుడా వేగువ నక్షత్రమా అద్వితీయుడా అతి శ్రేష్ఠుడా నీతి సూర్యుడా జయశీలుడా బలవంతుడా ఆశ్చర్యకరుడా యుగయుగములు తరతరములు మారని దేవుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.