TG-4186
Telugu

రక్షకుడా యేసు ప్రభో

Rakshakudaa Yesu Prabho

0
views
పల్లవి

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా||

1వ చరణం

సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) శ్రమ అయిననూ బాధ అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా||

2వ చరణం

ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) హింస అయిననూ హీనత అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా||

3వ చరణం

ఎన్నడైన మారని మా యేసుడుండగా (2) ఉన్నవైననూ రానున్నవైననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ రక్షకుడా… ||రక్షకుడా||