రక్షకుండుదయించినాడట
Rakshakundudayinchinaadata
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2) కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2) శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2) అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.