రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ
rakssakaa, nan marvambooku morrrra
పల్లవి
రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ నాలించు అన్యులైనవారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||రక్షకా, నన్||
1వ చరణం
నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము. ||రక్షకా, నన్||
2వ చరణం
నీదు పుణ్య మేను నమ్మి యా శ యింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మఁ బ్రోవు ప్రేమతో ||రక్షకా, నన్||
3వ చరణం
నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరలములయందు దిక్కు నీవెగా ||రక్షకా, నన్||