రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు

rammanu chunnaadu ninnu prabhu yeesu

🎵 TG-1211🌐 Telugu
పల్లవి

రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచతో తన కరము చాపి -రమ్మను చున్నాడు

1వ చరణం

ఎటు వంటి శ్రమలందును - ఆధరణ నీ కిచ్చునని గ్రహియించి నీవు యేసును చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు ||రమ్మను చున్నాడు||

2వ చరణం

కన్నీరంతా తుడుచును- కను పాపవలె కాపాడున్‌ కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడున్‌ ||రమ్మను చున్నాడు||

3వ చరణం

సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ||రమ్మను చున్నాడు||

4వ చరణం

సకల వ్యాదులను స్వస్థపరుచుటకు - శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్‌ ||రమ్మను చున్నాడు||

Report Error