TG-4189
Telugu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

rammanuchunnaadu ninnu prabhu yeesu

D G S DinakaranSolipovaladuడ్ జి స్ దినకరన్ · D G S Dinakaranడ్ జి స్ దినకరన్ · D G S Dinakaran
26
views
పల్లవి

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను||

1వ చరణం

కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను||

2వ చరణం

సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను||

3వ చరణం

సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.